‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

‘సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

NDL: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహానంది మండల వైద్యాధికారి భగవాన్ దాస్ పేర్కొన్నారు. సోమవారం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న సేవా పథకంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించి సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎన్ఎస్ఎస్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.