అమెరికాకు పాక్ నుంచి ముప్పు: నిఘా విభాగం చీఫ్

అమెరికాకు పాక్ నుంచి ముప్పు: నిఘా విభాగం చీఫ్

అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసి గబ్బార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాల్లో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాక్ కూడా ఒకటని గబ్బార్డ్ పేర్కొన్నారు. ఆయా దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ వార్ హెడ్‌లను రెండింటినీ మోయగల అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పింది.