'తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు'
TPT: ప్రముఖ యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లింది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉండగా, భక్తులకు ప్రసాదం పంచారు. శివజ్యోతి, ఆమె స్నేహితుడు ‘తిరుమలలో కాస్టీలో ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం’ అంటూ కామెంట్లు చేశారు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.