పోలేరమ్మ ఆలయానికి ప్రత్యేక అలంకరణ

PLD: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినుకొండలోని గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఆగస్టు 15న ఆలయ అంతరాలయాన్ని జాతీయ జెండాలు, దండలతో అలంకరించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.