ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి

NDL: శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడులో శుక్రవారం పొల పనులకు వెళుతున్న కూలీల ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వరలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ గాయపడటంతో ఆమెను వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం నంద్యాలకు మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.