వినోభానగర్‌లో బీజేపీ కార్పొరేటర్ల పర్యటన

మేడ్చల్: ముషీరాబాద్ వినోభానగర్‌లో దినేష్ అనే యువకుడు నాలాలో పడి ప్రమాదానికి గురైన స్థలాన్ని బీజేపీ కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ..హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాల సమన్వయ లోపం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. వర్షాకాలానికి ముందే సంసిద్ధం కావాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు.