నత్త నడకన రోడ్డు పనులు.. ప్రజల అవస్థలు
MDCL: బోడుప్పల్‌లో రూ.19.60 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బంగారు మైసమ్మ ఆలయం నుంచి చెంగిచెర్ల వరకు, అంబేద్కర్ విగ్రహం నుంచి చిలుకానగర్ వరకు పనులు ఆలస్యమవుతున్నాయి. విద్యుత్ స్తంభాల మార్పులో నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.