ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన గురువారం కోటలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు 30 వినతులు అందాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పేందుకు జనం క్యూ కట్టారు. రోడ్లు, కాలువలు, తాగునీరు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరగా ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధించిన అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.