స్వీయ జనగణనలో పాల్గొన్న మంత్రి సుభాష్

స్వీయ జనగణనలో పాల్గొన్న మంత్రి సుభాష్

కోనసీమ: భారతదేశ జనాభా గణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన స్వగృహంలో స్వీయ గణన పోర్టల్ ద్వారా గురువారం అమలాపురంలో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం అందిస్తున్న ఈ స్వీయ గణన విధానాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.