గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
PPM: కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, స్టాక్ రూంను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న భోజనాల్లో నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.