రోడ్డు ప్రమాదంలో ఉపసర్పంచ్ మృతి
BHNG: బొమ్మలరామరం మండలం తుంకుంట ఉప సర్పంచ్ మేకల బాలకృష్ణ ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గ్రామ అభివృద్ధిలో చురుగ్గా ఉంటూ, నిరంతరం ప్రజా సేవ చేసే యువ నాయకుడి అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ కష్టసుఖాల్లో తోడుండే మంచి వ్యక్తిని కోల్పోయామని గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.