ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు

ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు

NLR: కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని, పండితులు శేషాచార్యుల ద్వారా పంచాంగ శ్రవణం విన్నారు. కొత్త ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి, వ్యవసాయం బాగుంటుందని పంచాంగం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.