భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

JN: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లాలో వాగులు పొంగి పోవడం, శిథిలావస్థలో ఉన్న ఇల్లు కూలిపోవడం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో వెంటనే కంట్రోల్ రూమ్ నంబరు 9052308621కు సమాచారం అందించాలని కోరారు.