ఉరేసుకుని వ్యక్తి ఆత్మ హత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మ హత్య

జగిత్యాల రూరల్ మండలం వడ్డెర కాలనీకి చెందిన కంది రాజు (32) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్సై ఉమాసాగర్ కథనం ప్రకారం.. రాజు కొంతకాలంగా చెడు కలలు వస్తున్నాయంటూ మానసికంగా కుంగిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.