సచివాలయాలలో MPDO ఆకస్మిక తనిఖీలు

సచివాలయాలలో MPDO ఆకస్మిక తనిఖీలు

VZM: రాజాం MPDO శ్రీనివాసరావు సోమవారం మండలంలో పలు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌ సర్వేలను పూర్తి చేయాలని, వర్షాలు కురుస్తున్నందున అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులలో నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు.