ఆర్టీసీ కార్మికుల పని భారాన్ని తగ్గించాలి: TUCI
ADB: RTC కార్మికుల పని భారాన్ని తగ్గించి ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జగన్ సింగ్, దళిత్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో సమావేశమై వారు మాట్లాడారు. ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. వారి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.