'మాల ధారణతో మనిషి ప్రవర్తనలో మార్పు'
ADB: అయ్యప్ప మాల ధారణతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. రూరల్ మండలంలోని బేల్లూరి గ్రామంలో అయ్యప్ప జన్మదినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.