హోటల్స్‌కు గ్యాస్ సరఫరా చేయాలని జేసీకి వినతి
కోనసీమ: రెస్టారెంట్‌లకు, హోటల్‌కు వాణిజ్య గ్యాస్ సిలిండర్‌లు సరఫరా చేయకపోతే వాటిని మూసేసే పరిస్థితి ఏర్పడుతుందని రెస్టారెంట్ యూనియన్ అధ్యక్షులు నల్లా పవన్ అన్నారు. ఈ మేరకు వారు సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జేసీ నిశాంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. వందలాది మంది వర్కర్‌లు హోటల్స్‌లో పనిచేసి బ్రతుకుతున్నారని, వాటిని మూసేస్తే రోడ్డున పడతారని తెలిపారు.