శ్రీరాముని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

NGKL: చారకొండ మండలం సిర్సనగండ్ల గ్రామంలోని శ్రీరాముని ఆలయాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ సమన్వయకర్త మర్రి జనార్ధన్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.