బైర్లూటి ప్రమాదంపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

AP: నంద్యాల జిల్లా బైర్లూటి ప్రమాదంలో ఐదుగురి మృతిపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.