మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

GDWL: అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను వినియోగించుకోవాలని సూచించారు. పంట నాణ్యతను పరిశీలించిన ఆయన, ఈ కేంద్రం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.