భైరవాణి తిప్ప ప్రాజెక్టులో నీరు.. ఆనందంలో రైతులు
ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సోమవారం ఉదయం నాటికి 1,654.9 అడుగుల మేర నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1,655 అడుగులుగా ఉంది. ఇప్పటికే అనేకమార్లు గేట్లు ఎత్తి నీటిని వేదావతి హాగరికి విడుదల చేసారు.