VIDEO: 'వంతెనను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న పాలవాగు'

KMM: మధిర మండలం కృష్ణాపురం వద్ద వైరా ప్రధాన రహదారిలో ఉన్న వంతెనను తాకుతూ పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని స్థానికులు తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఈ రాత్రికి వద్ద ఉధృతి మరింతగా పెరిగి వంతెన పైకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విషయం తెలుసుకున్న మధిర రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి అటుగా వెళ్లే వాహనదారులకు, స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.