వీర జవాన్ కుటుంబానికి నివాస స్థల పత్రాలు అందజేత
NZB: దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్ ఎర్రం నరసయ్య కుటుంబానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం, జవాన్ మాతృమూర్తి ఎర్రం కళావతికి ఆర్మూర్ పట్టణంలోని 300 గజాల నివాస స్థల పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు.