కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NLR: వలేటివారిపాలెం మండలం సింగమనేనిపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త బాశం దినేష్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం ఆవిష్కరించారు. చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో దినేష్ మృతి చెందడం బాధాకరమని, పార్టీలో చురుకుగా పనిచేసి అన్ని కార్యక్రమాల్లో ముందుండేవాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.