ఫ్లేమింగో ఫెస్టివల్-2026 ఏర్పాట్లు మొదలు పెట్టండి: కలెక్టర్

ఫ్లేమింగో ఫెస్టివల్-2026 ఏర్పాట్లు మొదలు పెట్టండి: కలెక్టర్

తిరుపతి: 2026 జనవరిలో నిర్వహించబోయే ఫ్లేమింగో ఫెస్టివల్ విజయవంతం కోసం ఏర్పాట్లను తక్షణం ప్రారంభించాలని కలెక్టర్, జిల్లా పర్యాటక మండలి ఛైర్మన్ డా.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లో ఫారెస్ట్, పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఉత్సవాన్ని శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.