అన్నవరం శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం

KKD: అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ శనివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని 24 గంటలు గడిస్తేనే గాని చెప్పలేమని డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.