VIDEO: రసాయన ఎరువులు వద్దు.. పకృతి వ్యవసాయం ముద్దు
KNR: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా సాగు చేపట్టాలని KVK ప్రతినిధులు రైతులకు సూచించారు. సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలోని పంట పొలాలను BRC ఇన్ ఛార్జ్ మురళీధర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆవు పేడ, ఆవు మూత్రం, వివిధ రకాల చెట్ల కషాయాలతో తయారు చేసిన కషాయాలను ఎరువులుగా వాడటం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని అన్నారు.