మండలంలో చిరు జల్లులు

మండలంలో చిరు జల్లులు

KMM: ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం వాతావరణం మారింది. గత ఐదు రోజులుగా భానుడి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు. కామంచికల్, తీర్థాల, గోళ్ళపాడు, దారేడు, పల్లెగూడెం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. అటు మిర్చి నారు వేసినందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ.. పనుల్లో నిమగ్నమయ్యారు.