భవన నిర్మాణ కార్మికుడికి ఆర్థిక సహాయం

GNTR: మంగళగిరి పరిధి నవులూరులో పక్షవాతంతో బాధపడుతున్న భవన నిర్మాణ కార్మికుడు మంగరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల శ్రీనివాసరావు ఆదివారం రూ.31 వేల ఆర్థిక సహాయం అందజేశారు. తాను రూ.15 వేలు, తమ కంపెనీలోని కార్మికులు రూ.16 వేలు కలిపి మెుత్తాన్ని బాధిత కార్మికుడికి అందజేశామని శ్రీనివాసరావు తెలిపారు.