కాఫీ బెర్రీ బోరర్ నివారణకు కలెక్టర్ కీలక ఆదేశాలు
ASR: కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి నివారణకు కలెక్టర్ దినేష్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్షిక ప్రభావితమైన ప్రాంతాలలో ఈ పురుగు వ్యాప్తి బయటికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలుచేయాలని శుక్రవారం అధికారులను ఆదేశించారు. అరకు డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లో కాఫీ కొనుగోలు, అమ్మకాలకు నియంత్రణ విధించారు. కాఫీ క్రయవిక్రయాలను నిషేధించారు.