'ప్రభుత్వం అండగా ఉంటుంది'

'ప్రభుత్వం అండగా ఉంటుంది'

మార్కాపురం జిల్లా ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్సులో 10 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.