'సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి'

ADB: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ తెలిపారు. సోమవారం భీంపూర్ మండల కేంద్రంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో రసాయనాలను పిచికారి చేసినట్లు పేర్కొన్నారు.