మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్... కేసు నమోదు
MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్సై రమేష్ బాబు తన సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.