ఏలూరులో నల్ల బ్యాడ్జీలతో నిరసన
ELR: చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ (జేసీ) రవీంద్రనాథ్ రెడ్డి సిబ్బందిపై పరుష పదజాలం వాడటాన్ని నిరసిస్తూ ఏలూరు వాణిజ్య పన్నుల కార్యాలయం సిబ్బంది నిరసన చేపట్టారు. గత నాలుగు రోజులుగా వారు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇందులో ఉద్యోగ సంఘాల నాయకులు కె.చిట్టిబాబు, జాన్బాబు, ప్రసాద్ బాబు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.