అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ITDA PO

PPM: ఐటీడీఏ పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథం గురువారం సీతంపేట మండలం సోమగండి అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అంగన్వాడీలో పిల్లల ఎత్తు బరువులు రికార్డు చేసే రికార్డును పరిశీలించారు. అనంతరం పిల్లలకు సక్రమంగా నేటి ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ITDA ఏపీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.