ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

KMRD: భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో గల 44 జాతీయ బైపాస్ రోడ్డుపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదాచారుడు రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి ఆర్మూర్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంతో వచ్చి వ్యక్తిని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధిత వ్యక్తిని అంబులెన్స్‌లో తరలించారు.