'రైతుల సంక్షేమం గురించి BRS నాయకులు మాట్లాడటం విడ్డూరం'

'రైతుల సంక్షేమం గురించి BRS నాయకులు మాట్లాడటం విడ్డూరం'

ADB: రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని పేర్కొన్నారు.