మతాలను దాటకపోతే అభివృద్ధి సాధ్యం కాదు: పవన్
AP: కూటమికి అన్ని కులాలు, మతాల మద్దతు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కులాలు, మతాలను దాటకపోతే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. మనం బాధ్యతగా ఉండాలని.. లేకపోతే ఎన్ని బడ్జెట్‌లు పెట్టినా ఉపయోగం ఉండదని చెప్పారు. అలాగే, కోర్టుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు.