విద్యుత్ తీగలు తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి విద్యుత్ తీగల తగిలి తీవ్ర గాయాలయ్యాయి. రాఘవేంద్ర వారధి వద్ద 11KV విద్యుత్ తీగలు ప్రమాదకరంగా క్రిందకి వేలాడుతున్నాయి. గోదావరిలో బోటుపై చేపల వేటకు వెళ్లిన మల్లాడి శ్రీనుకు విద్యుత్ వైరు తగలడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. బాధితుడుని చికిత్స కొరకు కాకినాడ జి.జి.హెచ్.కు తరలించారు.