అదిలాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు
ADB: జిల్లాలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాలేశ్వరంలోని శ్రీ కాళేశ్వర స్వామి దర్శనార్థం ఆదిలాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ బస్సు ఆదివారం రాత్రి 10 గంటలకు బయలుదేరి సోమవారం ఉ. 4 గంటలకు కాళేశ్వరం చేరుకుంటుంది. మరిన్ని వివరాల కోసం 7382840065 నంబరులో సంప్రదించాలని కోరారు.