రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ASR: చింతూరులోని మద్దిగూడెం వద్ద కారు అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తుండగా మద్దిగూడెం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కల్వర్టును ఢీ కొంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.