ఎనమదలలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ఎనమదలలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

GNTR: ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం, ఎనమదల గ్రామంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుగుణ బేగం, మండల విస్తరణ వ్యవసాయాధికారి నాగమణి రైతులకు డిజిటల్ క్రాప్ సర్వే గురించి తెలియజేశారు. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతు పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. నాటయ్ ముందు విత్తన శుద్ద గురించి రైతులకు తెలిపారు.