'63 కేంద్రాల్లో అదనపు బలగాలు'
KMM: మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. మూడు స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్, 78 రూట్ మొబైల్ పార్టీలు, 15 ఎఫ్ఎస్టీ బృందాలు, 30 ఎస్ఎస్టీ బృందాలను నియమించగా, 63 క్రిటికల్ కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని వెల్లడించారు.