రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

కోనసీమ: అమలాపురం మండలం రోళ్ళపాలెం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తోట వినయ్(23) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న వినయ్, నిమ్మకాయల సురేష్‌ను టాటా మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. రాజమండ్రిలో ప్రైవేట్ ఆసుపత్రిలో వినయ్ మరణించగా, గాయపడిన సురేష్ అమలాపురంలోని చికిత్స పొందుతున్నాడు.