పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలి'
NDL: స్వశక్తితో జీవనం సాగించే ఆటో డ్రైవర్లు ఆరోగ్యం, కుటుంబం పరిరక్షిస్తూ, పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో” కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఉప రవాణా అధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.