VIDEO: నిజామాబాద్‌లో పవన్ ఫ్యాన్స్ హంగామా
NZB: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురువారం విడుదలైన సందర్భంగా నిజామాబాద్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన నేతలు థియేటర్ల ఎదుట హంగామా చేశారు. డీజే పెట్టి పవన్ కళ్యాణ్ పాటలతో డ్యాన్సులు వేశారు. పవన్ కళ్యాణ్ భారీ కటౌట్‌కు దిష్టి తీశారు. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల ముందు సందడి వాతావరణం నెలకొంది.