వెలిగొండ టన్నెల్-2 పనులపై మంత్రి సమీక్ష
AP: వెలిగొండ ప్రాజెక్టుతో పాటు ఫీడర్ కెనాల్ పనులను మంత్రి నిమ్మల రామనాయుడు పరిశీలించారు. శ్రీశైలం కొల్లం వాగు నుంచి సుమారు 18 కిలోమీటర్ల మేర పడవలో ప్రయాణించి మంత్రి ప్రాజెక్టు సొరంగం వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా టన్నెల్-2 వద్ద జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.