వేమిరెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు
NLR: బుచ్చి మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కనక దుర్గమ్మ ఆలయంలో ఆలయ గౌరవ అధ్యక్షులు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు.