ఆ గ్రామంలో నిరంతర స్వచ్ఛభారత్

ఆ గ్రామంలో నిరంతర స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డ్ లో నిర్వహించారు. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. పరిసరాలను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో మూడవ రోజు గ్రామంలో తడి, పొడి చెత్త పై మహిళా సంఘాలకు పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ అవగాహన కల్పించారు.